బాలల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
ముఖ్యమైన పాయింట్స్:సీనియర్ సివిల్ జడ్జి అజయ్ కుమార్ జాదవ్జడ్పిహెచ్ఎస్ హైస్కూల్లో పోక్సో చట్టంపై న్యాయ అవగాహన కార్యక్రమం బాలలపై లైంగిక వేధింపులను అరికట్టడంతో పాటు, బాలల హక్కులు, రక్షణపై వేములవాడ పట్టణంలోని జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ హైస్కూల్లో బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా న్యాయ సేవాధికారిక సంస్థ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ సురక్షిత్ బచ్పన్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా పోక్సో (POCSO) చట్టంపై న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వేములవాడ సీనియర్ సివిల్ కోర్టు జడ్జి అజయ్ కుమార్ జాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి అజయ్ కుమార్ జాదవ్ మాట్లాడుతూ బాలలపై జరిగే లైంగిక వేధింపులను అరికట్టడంలో ప్రతి...