యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి – టీఆర్వీకే కోఆర్డినేటర్లు
ముఖ్యమైన పాయింట్స్:ఎల్ నినో ప్రభావం.. నీటి పొదుపుపై రైతులకు అవగాహన బోయినపల్లి,వీవీన్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో గురువారం ‘ఎల్ నినో ప్రభావం – నీటి పొదుపు’ అంశంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులు, టీఆర్వీకే (TRVK) కోఆర్డినేటర్లు డాక్టర్ ఆర్. సాయి కుమార్ (వేములవాడ), పి.మధుకర్ రావు (కరీంనగర్) పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉండటంతో పాటు భూగర్భ జలాలపై ఒత్తిడి పెరిగే పరిస్థితులు ఉన్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో యాసంగి పంటల సాగులో రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ...