నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్

ముఖ్యమైన పాయింట్స్:చందుర్తి మండలం మూడపెల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ విద్యాలయం పనుల పరిశీలన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ విద్యాలయం నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.చందుర్తి మండలం మూడపెల్లిలో టీ జీ ఈ డబ్ల్యూ ఐ డీ సీ ఆద్వర్యంలో రూ. 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ విద్యాలయం పనులు కొనసాగుతుండగా, జిల్లా కలెక్టర్ గురువారం పరిశీలించారు.ఆవరణలో నిర్మాణ పనులు కొనసాగుతుండగా, క్షేత్రస్థాయిలో పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు.జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ విద్యాలయాలు నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు....