సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐక్యతా స్పూర్తితో ముందుకు సాగాలి
ముఖ్యమైన పాయింట్స్:ఐడీఓసీలో ఘనంగా జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐక్యతా స్పూర్తితో ముందుకు సాగాలని రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పేర్కొన్నారు.భారత తొలి ఉప ప్రధాని, మాజీ హోం శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా శనివారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో జాతీయ ఐక్యతా దినోత్సవం (రాష్ట్రీయ ఏక్తా దివస్) ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్,జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ..సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం ఉద్యోగులు, సిబ్బంది ఐక్యతా ప్రతిజ్ఞ చేశారు.అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ మాట్లాడుతూ..వల్లభాయ్ పటేల్...