సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేయూత

ముఖ్యమైన పాయింట్స్:భరోసాగా నిలిచిన సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు రాజన్న సిరిసిల్ల,వీవీన్యూస్ సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన నిరుపేదలు, నిరుద్యోగ యువత,మహిళలు,వృద్ధులకు విద్య,వైద్యం, ఆర్థిక సహాయం అందించడమే పరమావధిగా ‘సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి’ కృషి చేస్తోందని ప్రముఖులు పేర్కొన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల సమితి సేవా కార్యక్రమాల్లో భాగంగా ఇద్దరు పేద వ్యక్తులకు స్వయం ఉపాధి కల్పించేందుకు అరటి పండ్ల బండ్లను వితరణగా అందజేశారు.జీవనోపాధి కోసం ఇబ్బందులు పడుతున్న రాజు,రమణారెడ్డి అనే ఇద్దరు పేదలకు అరటి పండ్లు అమ్ముకుని కుటుంబాలను పోషించుకునేందుకు వీలుగా పండ్ల బండ్లను కొనుగోలు చేసి,ఆర్థిక సహాయంతో పాటు సమితి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా...