ప్రజాస్వామ్య పరిరక్షణ బాధ్యత పౌరులదే: చెన్నమనేని వికాస్ రావు
ముఖ్యమైన పాయింట్స్:ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు మారుతుంటాయి..దేశం, ప్రజాస్వామ్య వ్యవస్థలు శాశ్వతంగా నిలవాలి రాజన్న సిరిసిల్ల,వీవీన్యూస్ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చెన్నమనేని వికాస్ రావు అన్నారు. ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు మారడం సహజమని, అయితే భారతదేశం, ఇక్కడి ప్రజాస్వామ్య వ్యవస్థలు శాశ్వతంగా నిలవాలని ఆయన పేర్కొన్నారు.ఆదివారం వేములవాడ పట్టణంలోని మహాదేవ ఫంక్షన్ హాల్లో వేములవాడ నియోజకవర్గానికి చెందిన ప్రముఖ పౌరులు, మేధావులతో నిర్వహించిన ‘డైలాగ్ విత్ ఎమినెంట్ సిటిజన్స్’ (Dialogue with Eminent Citizens) సెమినార్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో పౌరుల పాత్ర,...