ఇలా అయితే రాకపోకలు సాగించేదెలా?
ముఖ్యమైన పాయింట్స్:రహదారిపైకి చేరుతున్న మురికినీరు.. లీకేజీతో వృథాగా పోతున్న మిషన్ భగీరథ నీరు వేములవాడ,వీవీన్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని 13వ వార్డుల్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో స్థానిక ప్రజలు,వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేములవాడ నుంచి మల్లారం, మరిమడ్ల మీదుగా నిజామాబాద్ జిల్లాకు వెళ్లే ప్రధాన రహదారిపైకి మురుగునీరు చేరుతుండటంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. రహదారిపై మురుగునీరు నిల్వ ఉండటంతో వాహనదారులు ప్రమాదాల భయంతో ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది.మరోవైపు మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజీ కారణంగా తాగునీరు సైతం రోడ్డుపైకి చేరి వృథాగా పోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ సమస్యకు తోడు పైప్లైన్ లీకేజీతో రహదారి పరిస్థితి మరింత...