సంకెపల్లి గ్రామంలో మ్యాజిక్ డ్రైనేజీ ఏర్పాటుకు కసరత్తు

వేములవాడ అర్బన్,వీవీ న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం సంకెపల్లి గ్రామంలో డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి గ్రామ సర్పంచ్ రెడ్డవేణి పరశురామ్ ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఇందులో భాగంగా అచ్చన్నపేట గ్రామంలో ఇప్పటికే ఏర్పాటు చేసిన మ్యాజిక్ డ్రైనేజీ వ్యవస్థను అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. సంకెపల్లి గ్రామంలోనూ ఈ విధానాన్ని అమలు చేసి డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ఈ పరిశీలన చేపట్టారు. ఈ కార్యక్రమంలో వేములవాడ అర్బన్ మండల ఎంపీడీవో డాక్టర్ బింగి కీర్తన,సర్పంచ్ రెడ్డవేణి పరశురామ్ ముదిరాజ్, మనోహర్ తదితరులు ఉన్నారు. గ్రామ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా,అభివృద్ధి దిశగా సంకెపల్లి ముందడుగు వేస్తోందన్నారు సర్పంచ్.