క్రికెట్ లో ఉత్తమ ప్రతిభ చూపాలి

ముఖ్యమైన పాయింట్స్:ఉన్నత స్థానాలకు ఎదగాలి.జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్.యువ క్రికెట్ క్రీడాకారిణికి క్రికెట్ కిట్, సామగ్రి అందించిన జిల్లా కలెక్టర్ రాజన్న సిరిసిల్ల,వీవీన్యూస్ క్రికెట్ పోటీల్లో గూడెపు వంశిక ఉత్తమ ప్రతిభ చూపాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు. ఈ నెల 12 వ తేదీ నుంచి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయస్థాయిలో జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో నిర్వహించనున్న క్రికెట్ టోర్నమెంట్లో రాష్ట్రం తరఫున జిల్లా నుంచి ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామానికి చెందిన గూడెపు వంశిక పాల్గొననున్నది. ఆ క్రీడాకారిణికి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ స్పోర్ట్స్ కిట్, సామగ్రి...