గర్భిణీలకు ఆరోగ్యంపై అవగాహన

ముఖ్యమైన పాయింట్స్:రుద్రవరం అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం కార్యక్రమం వేములవాడ అర్బన్,వీవీన్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రవరం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై ప్రత్యేక అవగాహన కల్పించారు. గర్భిణీల బరువు, ఎత్తు, రక్తహీనత వంటి అంశాలను పరిశీలిస్తూ,రక్తహీనత నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పౌష్టికాహారం ప్రాధాన్యత, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమం గ్రామ సర్పంచ్ ఊరడి సునీత రాజిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించగా..ముఖ్య అతిథులుగా జిల్లా ఆడిట్ అధికారి శ్రీనివాస్,వేములవాడ ఎంపీడీఓ కీర్తన, పంచాయతీ కార్యదర్శి మనీషా పాల్గొన్నారు.అనంతరం గ్రామంలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. భోజనం నాణ్యత, వడ్డింపు విధానాన్ని పరిశీలిస్తూ...