కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
కోనరావుపేట,వీవీ న్యూస్ కేంద్ర ప్రభుత్వం నిరుపేదలు, సామాన్య ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న బీమా, పెన్షన్ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని బ్యాంక్ ఆఫ్ బరోడా కనగర్తి బ్రాంచ్ అసిస్టెంట్ మేనేజర్ భూక్య పడావ్ సూచించారు.రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామ పంచాయతీ ఆవరణలో బుధవారం బ్యాంక్ ఖాతాదారులు, గ్రామ ప్రజలకు కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (PMSBY), ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), అటల్ పెన్షన్ యోజన (APY) వంటి పథకాలు సామాన్య ప్రజలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ఎంతగానో...