ప్రభుత్వ విద్యాలయాల్లో సకల సౌకర్యాలు
ముఖ్యమైన పాయింట్స్:విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి, వసతి గదులు, మౌలిక వసతుల కల్పన.ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కోనరావుపేట,వీవీ న్యూస్ రూ. 95 లక్షల 50వేలతో కేజీబీవీలో వసతి గదులు, టాయిలెట్స్, భవిత కేంద్రం, ఐకేపీ గోడౌన్ నిర్మాణానికి ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తో కలిసి శంకుస్థాపన.ప్రభుత్వ విద్యాలయాల్లో ప్రజా ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పిస్తుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు.రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో రూ.56 లక్షలతో నూతన వసతి గృహం, టాయిలెట్స్, రూ. 9 లక్షల 50...