పాఠ్యాంశాలు నిత్యం సాధన చేయాలి
ముఖ్యమైన పాయింట్స్:ప్రణాళిక ప్రకారం చదవాలి:జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్కోనరావుపేట కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో జిల్లా కలెక్టర్ తనిఖీ రాజన్న సిరిసిల్ల,వీవీ న్యూస్ విద్యార్థులు అన్ని పాఠ్యాంశాలు నిత్యం సాధన చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు. కోనరావుపేట మండల కేంద్రంలోని కేజీబీవీ విద్యాలయంలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ గురువారం తనిఖీ చేశారు. ముందుగా ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు రిజిస్టర్ పరిశీలించారు. కిచెన్ లో మెనూ చార్ట్ పరిశీలించి.. దానికి అనుగుణంగా భోజన పదార్థాలు సిద్ధం చేస్తుండగా, తనిఖీ చేశారు. కూరగాయలు, బియ్యం, పప్పుల నాణ్యత పరిశీలించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు, వసతులను విద్యార్థులు సద్వినియోగం...