మానవత్వం చాటుకున్న వేములవాడ పోలీసులు

రాజన్న సిరిసిల్ల జిల్లా,వీవీ న్యూస్ వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలో గురువారం సాయంత్రం శివ అనే వ్యక్తి అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చి రోడ్డుపై కుప్పకూలిపోయాడు. అదే సమయంలో విధి నిర్వహణలో భాగంగా అక్కడ ఉన్న కానిస్టేబుళ్లు సల్మాన్, షకీల్, పంతులు నాయక్, నరేందర్, సతీష్ కుమార్, రాజ్‌కుమార్ ఈ విషయాన్ని గమనించారు.వెంటనే స్పందించిన పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాధితుడి వద్దకు చేరుకుని మానవతా దృక్పథంతో ప్రథమ చికిత్స అందించారు. బాధితుడికి అవసరమైన సహాయం చేస్తూ చేతులు, కాళ్లు రుద్దడంతో కొద్దిసేపటికే ఆయన స్పృహలోకి వచ్చాడు.విధి నిర్వహణలో ఉన్నప్పటికీ ఆపదలో ఉన్న వ్యక్తిని గమనించి, తక్షణమే స్పందించి మానవత్వం చాటుకున్న పోలీసు సిబ్బందిని స్థానిక...