అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల అమలుపై అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) క్షేత్రస్థాయి పరిశీలన

కరీంనగర్,వీవీ న్యూస్ కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) గురువారం వీనవంక మండలంలోని కనపర్తి, బ్రహ్మణపల్లి, కోర్కల్ గ్రామ పంచాయతీలను సందర్శించి వివిధ అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖల అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. **జలసిరి పనుల పరిశీలన:** గ్రామాల్లో చేపట్టిన ఫామ్ పాండ్స్, రూఫ్‌టాప్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు, కమ్యూనిటీ సోక్‌పిట్స్, బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణాల పురోగతిని పరిశీలించారు. కనపర్తి గ్రామంలోని బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణంలో మిగిలిన పనులను 10 రోజుల్లో పూర్తి చేయాలని ఏఈ (ఆర్‌డబ్ల్యూఎస్)ను ఆదేశించారు. అలాగే మ్యాజిక్ సోక్‌పిట్స్‌కు...