*అభిమానాన్ని చాటుకున్న ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు
ముఖ్యమైన పాయింట్స్:లబ్ధిదారులు తిప్పారపు సత్తమ్మ ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సొంతింటి కల నెరవేరడంతో ఆనందం.. ఆ కలను సాకారం చేసిన ప్రభుత్వంపై కృతజ్ఞతాభావం.. వెరసి కాంగ్రెస్ పార్టీ పట్ల తమకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు.రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని వేములవాడ రూరల్ మండలం మల్లారం గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు తిప్పారపు సత్తమ్మ తమకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇంటిని నిర్మించుకుని, ఆ ఇంటి గేటుపై కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును ఏర్పాటు చేశారు. తమ సొంతింటి కల సాకారమైన ఆనందంలో కాంగ్రెస్ పార్టీ పట్ల...