వెంకటంపల్లిలో ఘనంగా దీపావళి వేడుకలు – సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
ముఖ్యమైన పాయింట్స్:ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి.. సీఎం జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం వెంకటంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో దీపావళి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తమ ఇళ్లలో కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా దీపావళి పండుగను జరుపుకున్నారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆవునూరి లక్ష్మి–చిన్న నర్సయ్య ఆధ్వర్యంలో గ్రామ ప్రజాప్రతినిధులు, నాయకులు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లను సందర్శించారు. గ్రామానికి చెందిన లబ్ధిదారులు ప్రజాప్రతినిధులకు ఆప్యాయంగా స్వాగతం పలికి, స్వీట్లు అందజేస్తూ, టపాసులు కాల్చి ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకున్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా...