పేదల సొంతింటి కలను సాకారం చేసిన ప్రజా ప్రభుత్వం

ముఖ్యమైన పాయింట్స్:ఇందిరమ్మ ఇళ్లలో లబ్ధిదారులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ఘన స్వాగతం పలికిన స్థానిక కౌన్సిలర్ ఇప్పపూల మమత అజయ్ దంపతులు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని 22వ వార్డుతో పాటు వేములవాడ రూరల్ మండలం మల్లారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నివాసాల్లో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి దీపావళి సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్,ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ‘మా...