ఘనంగా ధనలక్ష్మి మహా పూజ,పెద్దసేవపై ఊరేగింపు
ముఖ్యమైన పాయింట్స్:ఘనంగా ధనలక్ష్మి మహా పూజ, పెద్దసేవ ఊరేగింపు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో నరకచతుర్దశి (దీపావళి) పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం రోజున ప్రత్యేక పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు.ఆదివారం ఉదయం స్వామివారి ఆలయంలో ఉదయాత్పూర్వం గం. 3.30 నిమిషాల నుండి 3.40 నిమిషాల వరకు మంగళవాయిద్యాలు మోగించారు. అనంతరం గం. 3.40 నుండి 4.30 నిమిషాల వరకు సుప్రభాత సేవ - మంగళహారతి నిర్వహించారు. ఉదయం గం. 4.30 నుండి 4.45 వరకు నరకచతుర్దశి - దీపావళి పండుగ మంగళహారతి, పిమ్మట అభ్యంగన స్నానాలు జరిగాయి. ఆ తర్వాత గం. 4.45 నుండి 5.00 గంటల వరకు ఆలయ శుద్ధి నిర్వహించి,...