సీఎం సభకు భారీగా జన సమీకరణ
ముఖ్యమైన పాయింట్స్:సభా ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు,ఎమ్మెల్యేలు ఈ నెల19న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సిద్దిపేట పర్యటన నేపథ్యంలో నిర్వహించనున్న బహిరంగ సభకు భారీగా జన సమీకరణ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నాయకులు పిలుపునిచ్చారు.సభా ఏర్పాట్లను రాష్ట్ర మంత్రులు గడ్డం వివేక్ వెంకటస్వామి,పొన్నం ప్రభాకర్,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పరిశీలించారు. సభా ప్రాంగణాన్ని సందర్శించి, ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ సిద్దిపేట బహిరంగ సభ వేదికగా అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే ఇందిరా భీమా పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు,...