బహుళ పంటల సాగుపై వ్యవసాయ అధికారి సాయికిరణ్ క్షేత్ర సందర్శన

రుద్రంగి,వీవీ న్యూస్ ఒకే భూమిలో వివిధ రకాల పంటలు సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న రైతులు సుమంత్, రాజిరెడ్డిల పంటలను రుద్రంగి మండల వ్యవసాయ అధికారి సాయికిరణ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.రైతులు మిరప, పసుపు, వెల్లుల్లి, మెంతులు, పుచ్చకాయ, బీరకాయ, టమాటా, ఉల్లిపాయ, పాలకూర, వేరుశనగ, మొక్కజొన్న, కొత్తిమీర తదితర పంటలను సాగు చేస్తున్న తీరును పరిశీలించి వివరాలను సుమంత్,రాజిరెడ్డి అనే రైతులను అడిగి తెలుసుకున్నారు.వివిధ రకాల పంటల సాగుతో రైతులు వ్యవసాయంలో వైవిధ్యాన్ని పాటిస్తూ, ఆదాయ మార్గాలను పెంచుకునే అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలిపారు.