మానసిక దివ్యాంగుల, వికలాంగుల విద్యార్థులకు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహణ
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశాల మేరకు, మానసిక దివ్యాంగుల, వికలాంగుల విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని కోనరావుపేట మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS)లో ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు.ఈ శిబిరంలో మానసిక దివ్యాంగులైన విద్యార్థులకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించి, వారి శారీరక మానసిక ఆరోగ్య పరిస్థితులను సమగ్రంగా పరిశీలించారు. చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ వెంకటరమణ విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సలహాలు అందించారు. సైకాలజిస్ట్ డాక్టర్ అనూష విద్యార్థుల మానసిక ఆరోగ్య పరిస్థితులను అంచనా వేసి, అవసరమైన కౌన్సెలింగ్, సూచనలు అందించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి...