రైతులతో కలిసి నాలుగు నెలల క్షేత్రస్థాయి అధ్యయనం..మూడపల్లిలో రైతు సదస్సు

ముఖ్యమైన పాయింట్స్:రైతు సదస్సులో భాగంగా అగ్రికల్చర్ కళాశాల విద్యార్థులు రూపొందించిన మోడల్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి.రైతులకు ఎరువుల వినియోగం,నీటి పొదుపు, నాణ్యమైన సీడ్స్ గుర్తింపు, మృత్తికల ఆరోగ్యం, సేద్యం నూతన పద్ధతులపై అవగాహన కల్పించారు వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరువ చేయడంతో పాటు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసి పరిష్కార మార్గాలు సూచించడమే లక్ష్యంగా వ్యవసాయ విద్యార్థులు నాలుగు నెలలపాటు గ్రామాల్లో క్షేత్రస్థాయి అధ్యయనం నిర్వహించారు.తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని సిరిసిల్ల,జగిత్యాల వ్యవసాయ కళాశాలలకు చెందిన విద్యార్థులు RAWEP (Rural Agricultural Work Experience Programme) కార్యక్రమంలో భాగంగా చందుర్తి, కోనరావుపేట,బోయినపల్లి తదితర ప్రాంతాల్లోని తొమ్మిది గ్రామాల్లో పర్యటించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఒక్కో...