తీన్మార్ మల్లన్నపై హత్యాయత్నం
రాజన్న సిరిసిల్ల జిల్లా,వీవీ న్యూస్ తీన్మార్ మల్లన్నపై కుట్రపూరితంగా హత్యాయత్నం జరిగిందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు దండు వినోద్ ఆరోపించారు. శనివారం సిరిసిల్ల పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్ని కుట్రలు చేసినా తీన్మార్ మల్లన్న పాదయాత్ర ఆగదని స్పష్టం చేశారు. ఆయనకు ప్రాణహాని ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.