బావుసాయిపేట పాఠశాలలో కోతుల బెడద – భయాందోళనలో విద్యార్థులు,తల్లి తల్లిదండ్రులు
ముఖ్యమైన పాయింట్స్:రాజన్న సిరిసిల్ల,వీవీ న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో కోతుల సంచారం రోజురోజుకూ పెరుగుతుండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల ఆవరణలో కోతులు విచ్చలవిడిగా తిరుగుతూ చిన్నారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.హ్యాండ్ వాష్ చేసుకోవడానికి బయటకు వెళ్లాలన్నా, బాత్రూంకు వెళ్లాలన్నా విద్యార్థులు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా చిన్న పిల్లలు బాత్రూంకు వెళ్లే సమయంలో ఆయమ్మ తోడుగా ఉండాల్సి వస్తోందని తెలుస్తోంది. కోతులను గమనిస్తూ, వాటిని తరిమేందుకు ఉపాధ్యాయులు కూడా తమ విలువైన బోధనా సమయాన్ని వెచ్చించాల్సి వస్తోంది. పాఠశాల ఆవరణలోని చెట్ల కొమ్మలు తరగతి గదుల వరకు విస్తరించడంతో కోతులు సులభంగా క్లాస్ రూమ్లలోకి...