లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరి పత్రాలు పంపిణీ
ముఖ్యమైన పాయింట్స్:వేములవాడ అర్బన్,వీవీ న్యూస్ పేదల సంక్షేమం,బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.గరీబీ హఠావో,కూడు,గూడు,గుడ్డ నినాదాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని పేర్కొన్నారు. దేశంలో పేదల సంక్షేమానికి నిజమైన పునాది వేసింది ఇందిరమ్మ రాజ్యమేనని స్పష్టం చేశారు.సోమవారం వేములవాడ అర్బన్ మండల చేయూత పెన్షన్ మంజూరు పత్రాలను లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ఎంపీడీవో కీర్తనతో కలిసి మంజూరు పత్రలను అందజేశారు.ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఒకవైపు అభివృద్ధి,మరోవైపు సంక్షేమాన్ని సమాంతరంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. మనిషికి...