విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా గోపాష్టమి వేడుకలు

ముఖ్యమైన పాయింట్స్:రాజన్న సిరిసిల్ల జిల్లా గోరక్ష ప్రముఖ్‌గా గన్నమనేని ప్రదీప్ రావు నియామకం వేములవాడ టౌన్,వీవీ న్యూస్ కార్తీక శుద్ధ అష్టమి (గోపాష్టమి) పర్వదినాన్ని పురస్కరించుకుని విశ్వహిందూ పరిషత్ (VHP) ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలోని శ్రీగాయత్రి దేవాలయంలో గోపూజ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి,గ్రాసం సమర్పించారు. భారతీయ సంస్కృతిలో గోవుకు ఉన్న విశిష్ట స్థానాన్ని వివరిస్తూ, ప్రతి ఒక్కరూ గోసంరక్షణకు కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.అదేవిధంగా, ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా విశ్వహిందూ పరిషత్ నూతన గోరక్ష ప్రముఖ్‌గా గన్నమనేని ప్రదీప్ రావు నియమితులైనట్లు నాయకులు ప్రకటించారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన క్షేత్ర...