రైతులకు మద్దతు ధర అందించడమే లక్ష్యం

ముఖ్యమైన పాయింట్స్:కొత్తపల్లి,వీవీ న్యూస్ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బద్దిపెల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గ్రామ ప్రజాప్రతినిధులు ప్రారంభించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ తాండ్ర శ్రీనివాస్, ఉప సర్పంచ్ తిరుపతి,5వ వార్డు సభ్యుడు గర్రెపెల్లి వెంకటేష్ గౌడ్ లు కలిసి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు మీడియాకు తెలిపారు.ఈ కార్యక్రమంలో మహిపాల్,కోడూరి శ్రీనివాస్,చంద్రయ్య, రాజిరెడ్డి,ఐకేపీ నిర్వాహకులు, గ్రామ రైతులు పాల్గొన్నారు.రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.