నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేసిన మంత్రి పొన్నం
ముఖ్యమైన పాయింట్స్:అర్హత ఉండి పెన్షన్లు రాని వారు దరఖాస్తు చేసుకోవాలి.. అర్హులందరికీ పెన్షన్లు మంజూరు చేస్తాం.గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు, ఊటకుంటలు, ఇంకుడు గుంతల నిర్మాణానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి.ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో రాజకీయాలకు తావులేకుండా నిరుపేదలకు ప్రాధాన్యత ఇవ్వాలి కరీంనగర్,వీవీ న్యూస్ హుస్నాబాద్ నియోజకవర్గంలోని సైదాపూర్ మండలంలో అర్హులైన 642 మంది లబ్ధిదారులకు రాష్ట్ర రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రి,హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. నూతనంగా చేయూత పింఛన్లు పొందుతున్న 642 మంది లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. అర్హత ఉండి ఇంకా ఏడు రకాల పెన్షన్లు పొందని వారు వెంటనే...