మాట తప్పారు: BRS వేములవాడ నియోజకవర్గ ఇంచార్జి చల్మెడ లక్మినరసింహారావు

రాజన్న సిరిసిల్ల,వీవీ న్యూస్ దక్షిణ కాశీ వేములవాడ రాజన్న ఆలయ ప్రధాన గోపురాన్ని కనీస సమాచారం లేకుండా కూల్చివేయడం దారుణమని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 854 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ప్రముఖశైవక్షత్రం.. ప్రభుత్వ పెద్దలు తమ వ్యక్తిగత ప్రచారానికి వాడుకుంటున్నారని విమర్శించారు. బుధవారం వేములవాడ పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ. మాట తప్పిన ఎమ్మెల్యే..గతంలో ప్రధాన ఆలయాన్ని ముట్టుకోమని, కేవలం పరిసరాల్లో మాత్రమే అభివృద్ధి పనులు చేపడతామని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పష్టమైన హామీ ఇచ్చారని లక్ష్మీనరసింహారావు గుర్తు చేశారు. కోనరావుపేట సభలోనూ ఇదే విషయాన్ని పునరుద్ఘాటించిన ఎమ్మెల్యే, ఇప్పుడు మాట తప్పి ప్రధాన గోపురాన్ని...