పేదల సంక్షేమమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం.. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు

ముఖ్యమైన పాయింట్స్:107 మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు.. రుద్రంగి మండలంలో మొత్తం 2,275 మందికి పెన్షన్లు.రాష్ట్ర ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రుద్రంగి,వీవీ న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని రుద్రంగి మండలంలో అర్హులైన పేదలకు సంక్షేమ పథకాల ఫలాలను అందించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో నూతనంగా మంజూరైన 107 మందికి పెన్షన్ మంజూరు పత్రాలను అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రుద్రంగి మండలంలో నేటి వరకు మొత్తం 2,275 మందికి ప్రభుత్వం పెన్షన్లు అందిస్తోందని తెలిపారు. ఇందులో వృద్ధాప్య పెన్షన్లు, దివ్యాంగుల...