ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులు,సిబ్బందికి ఐడీఓసీలో శిక్షణ
ముఖ్యమైన పాయింట్స్:ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి పకడ్బందీ ఏర్పాట్లు18 నుంచి 59 ఏళ్ల వారు అర్హులు: కలెక్టర్ గరిమ అగ్రవాల్ రాజన్న సిరిసిల్ల,వీవీ న్యూస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి సంబంధించి ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై జిల్లాలోని ఎంపీడీవోలు,మున్సిపల్ కమిషనర్లు, మండల పంచాయతీ అధికారులు,మున్సిపల్ వార్డు ఆఫీసర్లు, పంచాయతీ సెక్రటరీలు ఇతర అధికారులకు సిబ్బందికి జిల్లా సమీకృత కార్యాలయం ఆడిటోరియంలో బుధవారం ప్రొజెక్టర్ ద్వారా శిక్షణ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని 18 నుంచి 59...