ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం
ముఖ్యమైన పాయింట్స్:వేములవాడ టౌన్,వీవీ న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులే ఉపాధ్యాయులుగా పాఠశాల నిర్వహణ, విద్యాబోధన చేశారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన చిన్నారి ఉపాధ్యాయులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజారత్నం బహుమతులను అందజేశారు. ఉపాధ్యాయ వృత్తి చాలా గౌరవప్రదమైనదని, ప్రతి రంగంలో ప్రతిభావంతులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవీందర్, కోటేశ్వర్, సలాం, బాలకృష్ణ, హమీద్, జ్యోతి, శిరోమణి, రమాదేవి, ఉమారాణి, భూదేవి తదితరులు పాల్గొన్నారు.