అందుబాటులో ఉండాలి.. మెరుగైన వైద్యం అందించాలి: కలెక్టర్
ముఖ్యమైన పాయింట్స్:రాజన్న సిరిసిల్ల,వీవీ న్యూస్ వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని, మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతి రోజు ఓపీకి ఎంత మంది వస్తారని ఆరా తీశారు.ఆరోగ్య కేంద్రంలో ఓపీ రిజిస్టర్, ల్యాబ్, వ్యాక్సిన్లు, ఇమ్యూనైజేషన్ గది, ఇన్ పేషెంట్ గదులు, ఇతర గదులు, ఫార్మసీ, ఆసుపత్రి ఆవరణలో పరిశీలించారు.జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ..ఆరోగ్య కేంద్రంలో ఉన్న ఏ.ఎన్.ఎం. లతో మాట్లాడి క్షేత్ర స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, ఏ.ఎన్.సీ రిజిస్ట్రేషన్లు, గర్భిణీల ఆరోగ్య విషయాలపై దృష్టి...