రాజగోపాల్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు! పున్న కైలాష్ బహిరంగ క్షమాపణ చెప్పాలి.. డీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ ఘాటు హెచ్చరిక
వేములవాడ వార్త ఉమ్మడి నల్లగొండ జిల్లా..మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ అన్నారు. కోమటిరెడ్డి సోదరుల రాజకీయ ప్రస్థానం, ప్రజాసేవ, పార్టీకి చేసిన సేవలను తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. సీనియర్ నాయకులపై వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదని, ఎవరెవరి స్థాయులు ఏమిటో తెలుసుకొని మాట్లాడాలని ఘాటుగా స్పందించారు.శుక్రవారం శాసనమండలి మాజీ చైర్మన్ నేతి విద్యాసాగర్ స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దైద రవీందర్ మాట్లాడుతూ.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మాట్లాడే నైతిక హక్కు పున్న కైలాష్కు లేదన్నారు....