తరచూ నకిలీ విత్తనాల కేసుల్లో పట్టుబడితే పీడీ యాక్ట్ అమలు

ముఖ్యమైన పాయింట్స్:నకిలీ విత్తనాలు,నాణ్యత లేని ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు.నకిలీ విత్తనాల విక్రయాలు,అక్రమ రవాణా నియంత్రణకు జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలుఎస్పీ మహేష్ బి. గితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో నకిలీ విత్తనాలు, నాణ్యత లేని ఎరువుల విక్రయాలు,అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీస్, వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.జిల్లాలో నకిలీ విత్తనాలను విక్రయించినా, అక్రమంగా రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని, తరచూ ఇటువంటి కేసుల్లో పట్టుబడే వారిపై పీడీ యాక్ట్ అమలు చేస్తామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. శనివారం రోజున పోలీస్,వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను...