బీజేపీలో చేరిన కోనరావుపేటకు చెందిన 200 మంది యువకులు

ముఖ్యమైన పాయింట్స్:యువకులను బీజేపీ పార్టీలోకి స్వాగతం పలికిన కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ రాజన్న సిరిసిల్ల జిల్లా నియోజకవర్గంలోని కోనరావుపేట మండలానికి చెందిన సుమారు 200 మంది యువకులు శనివారం బీజేపీలో చేరారు.బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చెన్నమనేని వికాస్ రావు నాయకత్వంలో కరీంనగర్లోని పార్లమెంట్ కార్యాలయంలో ఈ చేరికల కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.