ఘోర రోడ్డు ప్రమాదం

ముఖ్యమైన పాయింట్స్:రాజన్న సిరిసిల్ల,వీవీ న్యూస్ఆర్టీసీ బస్సు-కారు ఢీ..పలువురికి గాయాలు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డు చంద్రంపేట చౌరస్తా వద్ద ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోనరావుపేట వెళ్లే రహదారిపై సిరిసిల్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (TS 02 Z 0202) కారు బలంగా ఢీకొన్నాయి. ఉదయం వేళ పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు సరిగ్గా కనిపించకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు భావిస్తున్నారు. రెండు వాహనాలు వేగంగా వచ్చి బలంగా ఢీకొనడంతో ఆర్టీసీ బస్సు ముందు టైరు పూర్తిగా ధ్వంసమైంది. కారు ముందు భాగం సైతం నుజ్జునుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి తీవ్ర రక్తస్రావంతో కారులోంచి...