నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్ చేస్తాం.. వేములవాడ టౌన్ ఇన్స్పెక్టర్ హెచ్చరిక

ముఖ్యమైన పాయింట్స్:వేములవాడ టౌన్,వీవీ న్యూస్మాడిఫైడ్ సైలెన్సర్లు, మైనర్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని వేములవాడ టౌన్ ఇన్స్పెక్టర్ హెచ్చరించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు,కార్లకు కంపెనీ ఇచ్చిన ఒరిజినల్ సైలెన్సర్లను తొలగించి,అధిక శబ్దం వచ్చే మాడిఫైడ్ సైలెన్సర్లు అమర్చడంతో పాటు అతివేగంగా,నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.మాడిఫైడ్ సైలెన్సర్ల వల్ల ప్రజలు,వృద్ధులు,చిన్నపిల్లలు,ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలకు కూడా అతివేగం కారణమవుతోందని తెలిపారు. టౌన్ ఇన్స్పెక్టర్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఎస్ఐ సముద్రాల రాజు ఆధ్వర్యంలో పట్టణంలో ప్రత్యేక...