భీమన్న గుడిలో భక్తుల సందడి

ముఖ్యమైన పాయింట్స్:వేములవాడ,వీవీ న్యూస్శ్రీభీమేశ్వరస్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఉదయం 10:25 వరకు 27,897 మంది దర్శనం హరిహర క్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధ ఆలయమైన శ్రీభీమేశ్వరస్వామివారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటున్నారు.సోమవారం ఉదయం నుండి సుమారు 10:25 గంటల వరకు 27,897 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నట్లు ఆలయ ఈవో రమాదేవి, డిప్యూటీ ఈవో ప్రతాప నవీన్ కుమార్ లు వెల్లడించారు. భక్తులకు ధర్మదర్శనంలో ఇబ్బందులు లేకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. కోడె మొక్కులు,తలనీలాలు సమర్పించిన తర్వాత కార్తీక మాస సోమవారం స్వామివారికి ఇష్టమైన రోజు కావడంతో భక్తులు భక్తిశ్రద్ధలతో దీపాలు వెలిగించి సేవలో తరించారు.