ప్రమాద స్థలాన్ని పరిశీలించిన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే.

ముఖ్యమైన పాయింట్స్:ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు.ప్రమాదానికి కారణమైన వ్యాన్ డ్రైవర్‌పై కేసు నమోదు.. వ్యాన్ సీజ్ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం వెంకయ్యకుంట బధనకల్ గ్రామాల శివారులో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే గారు మంగళవారం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈసందర్భంగా ప్రమాదం జరిగిన తీరును, ప్రమాదానికి గల కారణాలను, రహదారి పరిస్థితులను, ఇతర సాంకేతిక అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.ప్రమాదానికి కారణమైన వ్యాన్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి,వ్యాన్‌ను సీజ్ చేసినట్లు తెలిపారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను అన్ని కోణాల్లో విచారించి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని,...