బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధికార ప్రతినిధిగా రేగుల శ్రీకాంత్

ముఖ్యమైన పాయింట్స్:వేములవాడ,వీవీ న్యూస్ క్రమశిక్షణ కలిగిన నాయకుడు, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే రేగుల శ్రీకాంత్‌కు భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధికార ప్రతినిధిగా మంగళవారం బాధ్యతలు అప్పగించింది.వేములవాడ పట్టణంలోని శ్రీసరస్వతి శిశు మందిర్‌లో విద్యాభ్యాసం ప్రారంభించి, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల స్ఫూర్తితో ఎదిగిన శ్రీకాంత్ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. దుబాయ్‌లో సీనియర్ ఇంజనీర్‌గా పనిచేసిన ఆయన, ఉద్యోగ జీవితాన్ని వదిలి సమాజ సేవ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. పార్టీ బలోపేతానికి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలకంగా పనిచేయడంతో పాటు, మున్సిపల్ ఎన్నికల్లోనూ క్రియాశీలక పాత్ర పోషించారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న ఆయన సేవలను...