రాజ్యాంగ పరిరక్షణ కోసం నిర్వహించే ‘సంవిధాన్ రక్షా మార్చ్’లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

ముఖ్యమైన పాయింట్స్:రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది:మంత్రి పొన్నం ప్రభాకర్ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏఐసీసీ పిలుపు మేరకు ఈ నెల 26వ తేదీన టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘సంవిధాన్ రక్షా మార్చ్’ రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మరియు హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.భారత రాజ్యాంగం దేశ ప్రజలకు కల్పించిన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం, సౌభ్రాతృత్వం వంటి మౌలిక విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంత్రి పేర్కొన్నారు....