విలీన గ్రామాలకు ఉపాధి హామీ పథకం అమలు చేయాలి

ముఖ్యమైన పాయింట్స్:లేదంటే గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీ నుంచి తొలగించాలి: వ్యవసాయ కార్మిక సంఘం వేములవాడటౌన్,వీవీ న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల ప్రజలకు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తిరిగి వర్తింపజేసి పనులు కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం వేములవాడ ఆర్డీఓ కార్యాలయంలో అధికారికి వినతిపత్రం అందజేశారు.నాంపల్లి, తిప్పాపురం, కోనాయిపల్లి, శాత్రాజ్‌పల్లి, అయ్యోర్‌పల్లి తదితర విలీన గ్రామాలతో పాటు పట్టణంలోని నిరుద్యోగ యువత, వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించాలని కోరారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చొరవ తీసుకొని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక జీవో ద్వారా ఉపాధి హామీ పథకాన్ని...