హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలి' డీఎంహెచ్ఓ డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్
రాజన్న సిరిసిల్ల,వీవీ న్యూస్ హెచ్‌పీవీ (HPV) వ్యాక్సినేషన్‌కు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ వైద్య సిబ్బందికి సూచించారు.ఈ సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని పీఎస్ నగర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (UPHC) ఆమె సందర్శించి వైద్య సేవలు, రిజిస్టర్లు, వివిధ రికార్డులను తనిఖీ చేశారు. అన్ని రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగా నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. హెచ్‌పీవీ వ్యాక్సిన్ ప్రాముఖ్యత, ప్రయోజనాలపై తల్లిదండ్రులు, బాలికలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని, అర్హులైన బాలికలందరికీ వ్యాక్సిన్ అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యాక్సినేషన్‌పై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి అవగాహన...