మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసిన ‘ఫూలే’ సినిమా హీరో ప్రతీక్ గాంధీ

ముఖ్యమైన పాయింట్స్:మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలను నేటి సమాజానికి చాటిచెప్పే చిత్రం ‘ఫూలే’ -మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్,వీవీ న్యూస్ మహాత్మా జ్యోతిబా పూలే జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన ‘ఫూలే’ (PHULE - 2025) సినిమా నేటి సమాజానికి ఆదర్శప్రాయమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. గురువారం మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ‘ఫూలే’ సినిమా హీరో ప్రతీక్ గాంధీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిబా పూలే జీవిత చరిత్రను, ఆయన సామాజిక ఉద్యమాలను వెండితెరపై ఆవిష్కరించిన సినిమా బృందాన్ని మంత్రి అభినందించారు. హీరో ప్రతీక్ గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు.మహాత్మా జ్యోతిబా పూలే...