పారిశుధ్య కార్మికులకు ఆరోగ్య పరిరక్షణ వస్తువుల పంపిణీ

ముఖ్యమైన పాయింట్స్:బావుసాయిపేట సర్పంచ్ షేక్ యాస్మిన్ ఫిరోజ్ పాషా ఆధ్వర్యంలో కార్యక్రమం కోనరావుపేట,వీవీ న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలో గ్రామ సర్పంచ్ షేక్ యాస్మిన్ ఫిరోజ్ పాషా ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లకు ఆరోగ్య పరిరక్షణ, వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించిన వస్తువులను పంపిణీ చేశారు.గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు కంపోస్ట్ షెడ్ వద్ద చెత్తను వేరు చేసే పనుల్లో నిరంతరం శ్రమిస్తున్న పారిశుధ్య కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని చేతి గ్లౌజులు, బెల్లం, కొబ్బరి నూనె, టవల్స్, సబ్బులను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామ పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు వారు చేస్తున్న...