రాజన్న సిరిసిల్ల కలెక్టర్ కు బండి సంజయ్ ఫోన్..అమృతకు ఇల్లు మంజూరు చేసిన కలెక్టర్

ముఖ్యమైన పాయింట్స్:ఇప్పటికే అమృతకు ఆర్ధిక సాయం అందించిన కేంద్ర మంత్రినిత్యావసర సరుకులతోపాటు అమృతకు అండగా నిలవాలని పార్టీ శ్రేణులకు ఆదేశం రాజన్న సిరిసిల్ల,వీవీ న్యూస్ సొంత ఇల్లు లేక స్మశానమే నివాసంగా మార్చుకుని అనారోగ్యంతో బాధపడుతున్న కుమారుడితో కలిసి దుర్భర జీవితాన్ని గడుపుతున్న చందుర్తి మండలం కిష్టంపేటకు చెందిన మర్రిపల్లి అమృతకు ఇల్లు మంజూరైంది. అమృతకు దీన స్థితికి చలించిపోయిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆమెకు బాసటగా నిలిచారు. అమృతకు తక్షణ సాయంగా ఇటీవల రూ.50 వేలు పంపారు. దీంతోపాటు జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్ కి ఫోన్ చేసి అమృతకు ఇల్లు మంజూరు చేయాలని కోరారు. బండి సంజయ్ సూచనతో...