కరీంనగర్‌లో క్లాసిక్ అభిరుచి రెస్టారెంట్ లైసెన్స్ తక్షణమే సస్పెన్షన్

ముఖ్యమైన పాయింట్స్:అపరిశుభ్రత, ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై ఫుడ్ సేఫ్టీ అధికారుల చర్య కరీంనగర్,వీవీ న్యూస్ కరీంనగర్ జిల్లా వావిలాలపల్లిలోని క్లాసిక్ అభిరుచి మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. శుక్రవారం నిర్వహించిన తనిఖీల్లో ఆహార తయారీ, నిల్వ, పరిశుభ్రతకు సంబంధించి పలు తీవ్రమైన లోపాలు గుర్తించడంతో రెస్టారెంట్ FSSAI లైసెన్స్‌ను తక్షణమే సస్పెండ్ చేశారు.తనిఖీల్లో పచ్చి గుడ్లతో మయోనైజ్ తయారీ, అపరిశుభ్రమైన రిఫ్రిజిరేటర్లు, ఫుడ్ కలర్స్ వినియోగం, ఫంగస్ పట్టిన నిమ్మకాయలు, అపరిశుభ్ర పరిస్థితుల్లో మాంసం నిల్వ చేయడం వంటి లోపాలను అధికారులు గుర్తించారు. అంతేకాకుండా సుమారు 30 కిలోల ఆహార, మాంసం పదార్థాలను సరైన లేబులింగ్...