అన్నదాతగా నిలిచిన ఆరేపల్లి సర్పంచ్ రాజు నవీన దంపతులు
ముఖ్యమైన పాయింట్స్:ఎదురుగట్ల వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్నప్రసాద వితరణ వేములవాడ రూరల్,వీవీ న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్ల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శనివారం నిర్వహించే అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఈ వారం కూడా భక్తిశ్రద్ధలతో కొనసాగింది.శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆలయానికి విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈరోజు అన్నప్రసాద వితరణకు ఆరేపల్లి గ్రామ సర్పంచ్ ఇటిక్యాల రాజు నవీన దంపతులు దాతలుగా వ్యవహరించారు.ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు, అర్చనలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతల కుటుంబాలపై...